Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Data Entry Assistant 178 Jobs : ఇంటర్ అర్హతతో 178 డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మరియు 200 ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ కు చెందిన బ్రాడ్ కాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). ఇరు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవడానికి అర్హులే.

3). ఆకర్షనీయమైన వేతనాలు.

4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.

Data Entry Assistant 178 Jobs

ఈ పోస్టులకు అర్హతలు కలిగిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.

బీఈసీఐఎల్ నుండి వచ్చిన ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థకు సంబంధించిన పోస్టుల భర్తీ ప్రక్రియ వివరాలను మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాం. Data Entry Assistant 178 Jobs

ముఖ్యమైన తేదీలు   :

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది     :   ఏప్రిల్ 25, 2022

విభాగాల వారీగా ఖాళీలు   :

ఆఫీస్ అసిస్టెంట్            -      200

డేటా ఎంట్రీ ఆపరేటర్స్    -     178

మొత్తం పోస్టులు  :

378 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి ఇంటర్ / గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తి చేసిన  అభ్యర్థులు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్ నైపుణ్యములు ఉండవలెను అని ప్రకటనలో తెలిపారు.

వయసు  :

21- 45 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) ఉండే అవకాశం కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

ఈ పోస్టులకు అప్లై చేసుకునే జనరల్ /ఓబీసీ కేటగిరీ/మహిళలు /ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ  అభ్యర్థులు 750 రూపాయలను మరియు ఎస్సీ /ఎస్టీ /ews/పీహెచ్ కేటగిరీలకు చెందిన  అభ్యర్థులు 450 రూపాయలను దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.

ఎలా ఎంపిక చేస్తారు:

వ్రాత పరీక్ష /కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ , టైపింగ్ టెస్ట్ (35wpm ఇన్ ఇంగ్లీష్ లేదా 30wpm ఇన్ హిందీ ), పర్సనల్ ఇంటరక్షన్ డిస్కషన్ ల ఆధారంగా ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఒక నిమిషంలో 35 ఇంగ్లీష్  పదములు(35 wpm ఇన్ ఇంగ్లీష్ )  లేదా ఒక నిమిషంలో 30 హిందీ పదములు(30 wpm ఇన్  హిందీ) టైపింగ్ టెస్ట్ నిర్వహణ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లుగా ప్రకటనలో తెలిపారు.

జీతములు   :

ఢిల్లీ గవర్నమెంట్ వేజెస్ రేట్స్ ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.

Website

Notification And Apply Link

Link in notification View

Post a Comment

0 Comments