Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Vizag and Other Citys 4775 Vacancies : ఆంధ్రప్రదేశ్ లో 4775 ఉద్యోగాలు, 20 రోజుల్లోనే మీ లోకల్ లో పోస్టింగ్స్

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంట్ లో జోన్ల వారీగా  ఖాళీగా ఉన్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రోవైడర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు : 

1). ఇవి ప్రభుత్వ విభాగానికి చెందిన పోస్టులు.

2). భారీ సంఖ్యలో పోస్టుల భర్తీ.

3). ఆకర్షనీయమైన వేతనాలు.

4). కేవలం 20 రోజుల్లోనే ఉద్యోగ నియామకాల ప్రక్రియ పూర్తి.

ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

మొదట కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసే ఈ పోస్టులను, అభ్యర్థుల పెర్ఫార్మన్స్ ఆధారంగా రెన్యువల్ చేయనున్నట్లుగా ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు విశాఖపట్నం, రాజమండ్రి, గుంటూరు మరియు కడప జిల్లాల్లో జోన్ల వారీగా  పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గురించి మరింత సవివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

నోటిఫికేషన్ విడుదల తేది                       :    ఏప్రిల్ 6, 2022

ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభం తేది              :   ఏప్రిల్ 7, 2022

ఆన్లైన్ అప్లికేషన్ చివరి తేది                      :   ఏప్రిల్ 16, 2022

మెరిట్ లిస్ట్ విడుదల తేది                        :    ఏప్రిల్ 20, 2022

మెరిట్ లిస్ట్ పై ఆబ్జెక్షన్స్ కు చివరి తేది :   ఏప్రిల్ 23, 2022

ఫైనల్ మెరిట్&సెలక్షన్ లిస్ట్ విడుదల తేది : ఏప్రిల్ 25,2022

సెలక్షన్ లిస్ట్ పై ఆబ్జెక్షన్స్ కు చివరి తేది  :  ఏప్రిల్ 26, 2022

ఫైనల్ సెలక్షన్ లిస్ట్ విడుదల తేది       :  ఏప్రిల్ 27, 2022

కౌన్సిలింగ్ నిర్వహణ తేది                 : ఏప్రిల్ 28-30, 2022.

ఉద్యోగాలు - వివరాలు  :

మిడ్ - లెవెల్ హెల్త్ ప్రోవైడర్స్           -     4775

జోన్ల వారీగా ఖాళీలు   :

జోన్ - 1 విశాఖపట్నం       -        974

జోన్ - 2 రాజమండ్రి           -      1446

జోన్ - 3 గుంటూరు            -       967

జోన్ - 4 కడప                   -      1368

మొత్తం పోస్టులు  :

4775 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు  :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ / బోర్డుల నుండి బీ. ఎస్సీ ( నర్సింగ్ ) కోర్సులను పూర్తి చేసి, ఏపీ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ అయి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఫర్ కమ్యూనిటీ హెల్త్ (సీపీసీహెచ్) ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బీఎస్సీ ( నర్సింగ్ ) లను కలిగి ఉండవలెను అని ప్రకటనలో తెలిపారు.

వయసు  :

35 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

40 సంవత్సరాలు వరకూ ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యంగులు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు   :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో తెలుపలేదు.

ఎలా ఎంపిక చేస్తారు..?

విద్యా అర్హతల మార్కుల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన జీతములు అందనున్నవి.

Apply Link

Website Link

Notification

Post a Comment

0 Comments