Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB Exams Special 2020 | RRB పరీక్షలలో భారత దేశ రాజ్యాంగానికి సంబంధించిన గతప్రశ్నపత్రాలలో వచ్చిన బిట్స్

NTPC RRB పరీక్షలలో భారత దేశ రాజ్యాంగానికి సంబంధించిన గత ప్రశ్నపత్రాలలో వచ్చిన బిట్స్


RRB పరీక్షలు డిసెంబర్ -15 నుంచి జరుగుతాయని ఇటీవలే భారత  కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టత నిచ్చిన  తరుణంలో మీ మీ RRB పరీక్షల ప్రిపరేషన్ వేగాన్ని పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది.. ఈ క్రమంలో ప్రతీ రోజు RRB సిలబస్ ను అనుసరించి సబ్జెక్టుల వారిగా గత ప్రశ్నపత్రాలలో వచ్చిన ముఖ్యమైన బిట్స్ ను మీకు ఈ వెబ్‌సైట్ అందిస్తుంది. కావున ఆయా అంశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి మీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారని ఆశిస్తున్నాము. 

1) భారత రాజ్యాంగంలో  ఏ భాగం కేంద్ర మరియు రాష్ట్ర సంబంధాల  గురించి తెలియచేస్తుంది?

A). 10వ భాగం
B).11వ భాగం
C).12వ భాగం
D).13వ భాగం.

సమాధానం : "B" [ 11 వ భాగం ]      

2) భారత రాజ్యాంగ రూపకల్పనకు పట్టిన కాలం?

A). 2 సంవత్సరాల 8 నెలల 10 రోజులు.
B). 2 సంవత్సరాల 11 నెలల 12 రోజులు.
C). 3 సంవత్సరాల 9 నెలల 18 రోజులు
D). 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు.

సమాధానం : "D" [ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ]

3) భారత పౌరసత్వం పొందుటకు ఒక వ్యక్తి కనీసం ఎంత కాలం భారత్ లో నివసించి ఉండాలి?

A).10 సంవత్సరాలు.
B).8 సంవత్సరాలు.
C). 7 సంవత్సరాలు.
D). 6 సంవత్సరాలు.

సమాధానం : " C " [ 7 సంవత్సరాలు ]. 

4) క్రింది వానిలో ప్రాథమిక విధుల దినోత్సవం?                        

A). జనవరి 3
B). నవంబర్ 14
C). అక్టోబర్ 2
D). జూన్ 25

సమాధానం :" A " [ జనవరి - 3 ]

5) పార్లమెంట్ అనగా..?

A). రాజ్యసభ + రాష్ట్రపతి.
B).రాష్ట్రపతి + లోక్ సభ.
C). రాష్ట్రపతి + ప్రధానమంత్రి + అటార్నీ జనరల్.
D). రాష్ట్రపతి + రాజ్యసభ + లోక్ సభ.

సమాధానం : " D " [ రాష్ట్రపతి + రాజ్య సభ + లోక్ సభ ] 

Post a Comment

0 Comments