Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB NTPC and RRB Gropu-4 Noble Awards Bits 2020 | రైల్వే పరీక్షలో వచ్చే నోబెల్ అవార్డ్స్ బిట్స్ మిస్ కాకండి.

డైనమేట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ జ్ఞాపకార్థం 1901 నుండి ప్రతీ సంవత్సరం  ఇచ్చే నోబెల్ అవార్డులు ను 2020 సంవత్సరానికి గాను వైద్యరంగంలో నేడు ప్రకటించారు.

నోబెల్ అవార్డు 2020 - వైద్య రంగం :

2020 సంవత్సరానికి గాను వైద్య రంగంలో నోబెల్ అవార్డులను స్టాక్ హోం వేదికగా,, నేడు నోబెల్ కమిటీ అధ్యక్షుడు థామస్ ప్రకటించారు.

"హెపటైటిస్ - సీ"  [HEPATITIES - C] వైరస్ ను కనుగొన్నందుకు అమెరికన్ శాస్త్రవేత్తలు హార్వే ఆల్టర్,, మైఖేల్ హాటన్ మరియు బ్రిటన్ శాస్త్రవేత్త చార్లెస్ రైస్ లకు వైద్య విభాగంలో  నోబెల్ -2020 అవార్డు ను దక్కించుకున్నారు. "

నోబెల్ -2020 వైద్య రంగ అవార్డు గ్రహీతలు  బంగారు పతాకంతో పాటు 1, 118, 000 డాలర్ల నగదు బహుమతిని అందుకోనున్నారు. 

ప్రపంచ వ్యాప్తంగా 70 మిలియన్లకు పైగా హెపటైటిస్ కేసులు ఉన్నట్లుగా మరియు ప్రతీ సంవత్సరం ఈ వ్యాధిన పడి సుమారుగా 4,00,000(నాలుగు లక్షల ) మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలుపుతూ,

వివిధ ప్రయోగాల ద్వారా "హెపటైటిస్ - సీ " అనే వైరస్ ను కనుగొన్నందుకు గాను హార్వే ఆల్టర్, మైఖేల్ హాటన్, మరియు చార్లెస్ రైస్ లు ముగ్గురు శాస్త్రవేత్తలకు వైద్య రంగ విభాగంలో నోబెల్ -2020 అవార్డుకు ఎంపిక చేసారు.

కాగా, నోబెల్ అవార్డులను సాహిత్యం, శాంతి, వైద్యం, భౌతికశాస్త్రం , రసాయన శాస్త్రం, మరియు అర్థ శాస్త్రం అనే ఆరు విభాగాలలో ప్రకటిస్తారు.

మరియు ప్రతీ సంవత్సరం డిసెంబర్ -10 వ తేదీన నోబెల్ వర్థంతి రోజున నోబెల్ అవార్డులను ప్రధానం చేస్తారు అనే విషయం మనకు విదితమే.

రాబోయే రోజుల్లో జరిగే  RRB,AP DSC,APPSC మరియు TSPSC గ్రూప్స్ పరీక్షలలో తప్పనిసరిగా ఈ నోబెల్ అవార్డ్స్ -2020 గురించి కచ్చితంగా బిట్స్ వచ్చే అవకాశం ఉంది.

కావున అభ్యర్థులు "telugucompetitive.com" ద్వారా ఈ విషయాలను అందుకొని విజయ తీరాలను అందుకొంటారని ఆశిస్తున్నాము. 

Post a Comment

0 Comments